బెంగాల్ లో చారిత్రక విజయం దిశగా బీజేపీ... నారా లోకేశ్ స్పందన

  • అసోం, బెంగాల్‌లో ఎన్డీయే విజయాలపై హర్షం
  • ఇది అభివృద్ధి, స్థిరత్వానికి లభించిన ప్రజామోదం
  • మోదీ దార్శనిక నాయకత్వానికి ప్రజలు ఆమోద ముద్ర వేశారు
  • వేగవంతమైన పాలనపై దేశ విశ్వాసాన్ని ఈ తీర్పు బలపరిచింది
ఇవాళ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అసోం, పశ్చిమ బెంగాల్ లో ఎన్డీయే కూటమి విజయపథంలో దూసుకెళుతోంది. ముఖ్యంగా, బెంగాల్ లో బీజేపీ చరిత్ర సృష్టిస్తోంది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎన్డీయే కూటమి విజయాల పట్ల సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేశారు.

"అసోం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయేకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అభివృద్ధి, స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలకు ఉన్న బలమైన విశ్వాసానికి ఈ ప్రజా తీర్పు అద్దం పడుతోంది" అని లోకేశ్ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. "మోదీ నాయకత్వంలో వేగంగా, పారదర్శకంగా, సమగ్రంగా అందే పాలనపై దేశ ప్రజల నమ్మకాన్ని ఈ తీర్పు మరింత బలపరిచింది. వృద్ధి, అవకాశాలు, సమ్మిళిత ప్రగతిని ఆకాంక్షించే భవిష్యత్ భారత్‌కు ఇది బలమైన ఆమోదం" అని ఆయన తన పోస్టులో వివరించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 293 స్థానాలకు గాను... ఓట్ల లెక్కింపులో బీజేపీ 5 స్థానాల్లో విజయం నమోదు చేసింది. మరరో 191 స్థానాల్లో ముందంజలో ఉంది.  అధికార తృణమూల్ కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది. 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

Nara Lokesh
West Bengal Elections
BJP Victory
NDA Alliance
Assembly Elections 2024
Narendra Modi
TMC
Andhra Pradesh
Political News

More Telugu News